CM Revanth Reddy: ఫ్యూచర్‌ సిటీ దేశంలో గొప్ప నగరం కానుంది...కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడి

ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

CM Revanth Reddy about Regional ring road, Future City(CMO X)

Hyd, January 10:  ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు.

హైదరాబాద్‌లోని గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి, స్వేచ్ఛా వాణిజ్యం, మార్కెట్లు పనిచేయడానికి పారిశ్రామిక రంగం సహకరించాలని కోరారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందించడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని చెప్పారు.

#TelanganaRising లక్ష్యంతో సేవల రంగం కేంద్రీకృతంగా ఫోర్త్ సిటీని నిర్మించాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. హైదరాబాద్‌లో సంపూర్ణంగా నెట్ జీరో లక్ష్యాలతో పనిచేస్తున్నాం అన్నారు.తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాం. అవుటర్ రింగ్ రోడ్డుకు రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యన రేడియల్ రోడ్లను నిర్మించబోతున్నాం. ఆయా ప్రాంతాల్లో ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ, సోలార్ పవర్ వంటి పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అని తెలిపారు.  సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు...మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న తెలంగాణ సీఎం.. వివరాలివే

హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చడంలో భాగంగా 3200 ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్ వాహనాలను సమకూర్చబోతున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్‌లను పూర్తిగా రద్దు చేశాం. ప్రస్తుతం ఎలక్టిక్ వాహనాల అమ్మకాలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి అన్నారు.రీజినల్ రింగ్ రోడ్ చుట్టూ తయారీ పరిశ్రమ, మార్కెటింగ్ కు అవసరమైన కేంద్రీకృత ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నది మా ఉద్దేశం అన్నారు.

తెలంగాణకు సముద్ర తీరప్రాంతం లేని కారణంగా డ్రై పోర్టును ఏర్పాటు చేస్తున్నాం. పోర్టుతో అనుసంధానం చేయడానికి మచిలీపట్నం ఓడరేవు వరకు ప్రత్యేక రహదారి, రైల్వే కనెక్టివిటీని ప్రతిపాదించాం అన్నారు సీఎం రేవంత్.నైపుణ్యత పెంచడానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి సారించాం. చైనా ప్లస్ వన్ వ్యూహంలో హైదరాబాద్‌ను ప్రపంచంలో ప్రధాన పెట్టుబడుల కేంద్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Harish Rao Comments on Benefit Shows: గేమ్‌ చేంజర్‌ మూవీపై హరీష్‌ రావు సంచలన కామెంట్స్‌, సీఎం రేవంత్‌ రెడ్డి టంగ్‌ చేంజర్‌ అయ్యాడన్న మాజీ మంత్రి

CM Revanth Reddy: ఫ్యూచర్‌ సిటీ దేశంలో గొప్ప నగరం కానుంది...కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడి

RS Praveen Kumar Slams CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ కి మొబిలిటీ వ్యాలీ కి తేడా ఏంటో చెప్పండి... కేటీఆర్ ఐడియాను కాపీ కొట్టారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపాటు

CM Revanth Reddy On Mamunur Airport: మహానగరంగా వరంగల్..మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణపై దృష్టి సారించాలన్న సీఎం రేవంత్ రెడ్డి...హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం

Share Now