CM Revanth For PCC Meeting: ఓ వైపు పాలన మరో వైపు పార్టీ..కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ కీలక సమావేశం

హైదరాబాద్ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు సీఎం. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలి పీసీసీ కార్యవర్గ సమావేశం కావడంతో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

cm revanth for PCC Meeting(Twitter)

Hyd, July 16:  ఓ వైపు పాలన మరోవైపు పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు సీఎం. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలి పీసీసీ కార్యవర్గ సమావేశం కావడంతో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నెల 18న రైతు రుణమాఫీ లక్ష వరకు చేయనున్న నేపథ్యంలో కీలక సూచనలు చేయనున్నారు రేవంత్. అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బలంగా ప్రచారం చేయాలని సూచించనున్నారు. అలాగే రుణమాఫీ కార్యక్రమాన్ని పండగలా ప్రతి వాడలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం, పార్ట సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచేలా పనిచేయాలని నేతలకు సూచించనున్నారు. అలాగే కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని భరోసా ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను మాజీలుగా చేసే వరకు నిద్రపోమని స్పష్టం చేశారు మాజీమంత్రి హరీష్‌ రావు. పటాన్‌చెరులో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు...గూడెం మహిపాల్ రెడ్డి పోయినా గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని... పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు నిద్రపోం అని తేల్చిచెప్పారు.

వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్న ఇటీవల నిరుద్యోగుల నిరసన, ప్రతిపక్షాల విమర్శలు సమర్థవంతంగా పార్టీ నేతలు తిప్పికొట్టలేకపోయారనే భావనలో ఉన్నారు సీఎం రేవంత్. అలాగే ఎమ్మెల్యేల చేరికల విషయంలో బీఆర్ఎస్,బీజేపీ విమర్శలకు ధీటుగా స్పందించడం లేదని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా కేడర్‌లో భరోసా నింపనున్నారు రేవంత్. ఇప్పటికే గృహజ్యోతి,మహాలక్ష్మీవంటి పథకాలను అమలు చేస్తున్నామని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామనే టాక్ ప్రజల్లోకి తీసుకెళ్లేలా కేడర్‌కు సూచనలు చేయనున్నారు రేవంత్.