CM Revanth Reddy: రైతులకు గుడ్ న్యూస్...సంక్రాంతి తర్వాత రైతు భరోసా, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, విధి విధానాలు త్వరలో వెల్లడి
సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్..రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విధివిధానాలు నిర్ణయిస్తామని వెల్లడించారు.
Hyd, Dec 1: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్..రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విధివిధానాలు నిర్ణయిస్తామని వెల్లడించారు.
మారు వేషాల్లో మారీచుడు, సుబాహువుల్లా బీఆర్ఎస్, బీజేపీ నేతలు మీ వద్దకు వస్తారు..వారు చెప్పేవి నమ్మకండి, వినకండన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారిందని....పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ రూ.7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందన్నారు. గతంలో అసెంబ్లీలో ప్రశ్నిస్తే విపక్షాలు అబద్ధాలు చెప్పాయన్నారు. అప్పులపై వాస్తవాలు బయటపడకుండా వ్యవహరించారు..అప్పులు, ఆస్తుల విషయంలో మా ప్రభుత్వం పారదర్శకంగా ఉందన్నారు. తెలంగాణ నీటి వాటాలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ అనుమతులు తీసుకోవాలని సూచన
మేం అధికారంలోకి రాగానే అన్ని అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం అన్నారు. కేసీఆర్ ఎగ్గొట్టిన రైతుబంధును మేం అధికారంలోకి రాగానే విడుదల చేశాం..రూ. 7625 కోట్ల బకాయిలను మొదటి విడతగా చెల్లించాం అన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.17,869 కోట్ల రుణమాఫీ చేశాం...ఇన్ని లక్షల కోట్ల అప్పులతో కేసీఆర్ మాకు ప్రభుత్వాన్ని అప్పగించారు అన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అప్పటి సీఎం, మంత్రులు, అధికారులు ఎవరూ చెప్పలేదని విమర్శించారు.