CM Revanth Reddy responds On Supreme Court Comments: న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంది, తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న సీఎం రేవంత్ రెడ్డి, పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడి
ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన రేవంత్.. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
Hyd, Aug 30: దేశ సర్వోన్నత న్యాయస్థానం..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన రేవంత్.. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం, అపారమైన గౌరవం ఉందని తెలిపారు. తన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్.... న్యాయవ్యవస్థపైనా, ఆ వ్యవస్థ స్వతంత్రతపైనా తనకు అత్యంత నమ్మకం ఉందని తెలిపారు. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే తాను.. ఎన్నటికీ న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
ఓటుకు నోటు కేసును తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా దీనిని తిరస్కరించింది న్యాయస్థానం. అయితే ఈ క్రమంలో సీఎం రేవంత్ చేసిన కామెంట్స్‌ను తప్పుబట్టింది న్యాయస్థానం. అక్రమమైతే కూల్చేయండి..సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి క్లారిటీ, బీఆర్ఎస్ వాళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
Here's Revanth Reddy Tweet:
వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు బెయిల్ ఇస్తామా అని ప్రశ్నించింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీం కోర్టు పట్ల గౌరవంగా మెలగాలని, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని తెలిపింది. దీంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చారు సీఎం రేవంత్.