CM Revanth Reddy On SC Categorization: ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్‌మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, మాదిగలను మోసం చేస్తున్న నయవంచకుడు సీఎం అని బీఆర్ఎస్ మండిపాటు
ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని...వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Hyd, Oct 9: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని...వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు సీఎం. 24గంటల్లో కమిషన్ కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా వన్ మెన్ కమిషన్ రిపోర్టు సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు రేవంత్.
సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీలో సభ్యుల మెప్పు పొందేందుకు అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి మోసం చేస్తున్న నయవంచకుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. రైతులను మోసం చేసినట్లు మాదిగలను మోసం చేయాలనుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం, ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన...అడ్డుకున్న పోలీసులు, వీడియో
తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడు...మాదిగలను మోసం చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అన్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వర్గీకరణ అమలు చేయాలని...అవసరమైతే మాదిగలు జాతీయ స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుడతాం అన్నారు.
ఉద్యోగ నియామకాల్లో మాదిగల వాటా తేల్చి నియామకాలు చేయాలని డిమాండ్ చేశారు ఎర్రోళ్ల శ్రీనివాస్. ఉద్యోగ నియామకాలు జరిగిన తర్వాత వర్గీకరణ జరిగితే ఏం లాభం?, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు నోరు విప్పాలన్నారు.