CM Revanth Reddy: తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న కోమటిరెడ్డి..నల్గొండ గాలి పీల్చుకుంటేనే సాయుధ పోరాటం గుర్తుకొస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాలనలో అభివృద్ధి శూన్యం అని మండిపాటు
నల్గొండ జిల్లా జీబీ గూడెం గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాలు సభలో పాల్గొని ప్రసంగించారు రేవంత్. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా నుంచే అనేక మంది ప్రాతినిధ్యం వహించారు అన్నారు.
Nalgonda, Dec 7: సరిగ్గా ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లా జీబీ గూడెం గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాలు సభలో పాల్గొని ప్రసంగించారు రేవంత్. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా నుంచే అనేక మంది ప్రాతినిధ్యం వహించారు అన్నారు.
కేసీఆర్ హయాంలో నల్గొండ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం కోమటిరెడ్డి మంత్రి పదవి కూడా వదులుకున్నారు ...నల్గొండ గాలి పీల్చుకుంటేనే సాయుధ పోరాటం గుర్తుకు వస్తుందన్నారు.
అంతకముందు యాదాద్రి థర్మల్ స్టేషన్ లోని 800 మెగావాట్ల యూనిట్ 2 ని జాతికి అంకితం ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. థర్మల్ స్టేషన్ లోని పైలాన్ ను ఆవిష్కరించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా వినతి, రాజకీయాలు చర్చించలేదన్న పొన్నం
Here's Video:
అలాగే నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లంల గ్రామ శివారులో ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. , ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టులో కీలకమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి ముఖ్యమంత్రి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు,ఎంపీ రఘువీర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.