Malala Simha Garjana Sabha: మాలల సింహగర్జన సభ, కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..అంబేద్కర్ అభయ హస్తం పథకంపై తెలంగాణ సీఎం ప్రకటన
మాలల సింహగర్జన సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. 200మంది అతిథులు కూర్చునేలా వేదికను సిద్దం చేశారు.
Hyd, Dec 1: సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇవాళ మాలల సింహగర్జన సభ జరగనున్న సంగతి తెలిసిందే. మాలల సింహగర్జన సభకు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. 200మంది అతిథులు కూర్చునేలా వేదికను సిద్దం చేశారు.
ఇవాళ జరగబోయే మాలల సింహగర్జన సభలో కీలక ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంబేద్కర్ అభయహస్తం పథకానికి సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. పాలమూరును అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు, రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ.. , రైతు సంక్షేమంపై చర్చకు రావాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్
ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్టుగా అంబేద్కర్ అభయహస్తం పథకంలో భాగంగా అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం అందించే పథకం ఇవాళ సీఎం ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అర్హులను గుర్తించి విధివిధానాలు ఖరారు చేసి పథకాన్ని అమలు చేయనున్నట్టు సమాచారం.