CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సచివాలయం ముందు నేడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ.. సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు.
Hyderabad, Sep 16: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని (Rajiv Gandhi Statue) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు ఆవిష్కరించనున్నారు. నేటి సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున నేతలు పాల్గొననున్నారు. నిజానికి గత నెలలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావించైనా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది.
బీఆర్ఎస్ ఆందోళనలు
సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తొంది. అయితే సచివాలయం లోపల డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు.
జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?