Telangana Election Results 2023: తెలంగాణలో గెలుపు దిశగా కాంగ్రెస్.. ఎమ్మెల్యేల తరలింపు కోసం తాజ్ కృష్ణలో సిద్ధంగా ట్రావెల్స్ బస్సులు.. వీడియోతో

లీడ్ ఫలితాలనుబట్టి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Congress Readied Buses for MLAs at Taj Krishna Hotel (Credits: ANI)

Congress Keeps Buses Ready in Hyderabad To Shift MLAs: తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కౌంటింగ్ ఆసక్తిగా సాగుతున్నది. లీడ్ ఫలితాలనుబట్టి తెలంగాణలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ తమ ట్రబుల్ షూటర్లను రంగంలోకి తెచ్చింది. సౌత్ లో కాంగ్రెస్ కి అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నిన్న రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకోగా ఆయన నుంచి కాంగ్రెస్ అభ్యర్థులందరికీ స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

ఒక్కొక్క కాంగ్రెస్ అభ్యర్థితో పాటు కర్ణాటక నుంచి వచ్చిన ఎమ్మెల్యేలలో ఒక్కొక్కరిని అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపొందినట్లు లేఖ అందుకున్న వెంటనే సదరు కాంగ్రెస్ కర్ణాటక ఎమ్మెల్యే గెలుపొందిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేని తమ ఎస్కార్ట్, గన్మెన్లతో పాటు హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్ కి తీసుకురాబోతున్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ, రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, పోటీలో లేని బీజేపీ

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ లో బీజేపీ లీడింగ్.. తెలంగాణలో ఆధిక్యంలో కాంగ్రెస్.. చత్తీస్‌ గఢ్‌ లోనూ కాంగ్రెస్‌ దే హవా

అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం మూడు బస్సులను సిద్ధం చేశారు. ఒకవేళ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే వెంటనే కాంగ్రెస్ లో గెలుపొందిన ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని బెంగళూరు బయలుదేరేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజ్ కృష్ణ హోటల్ లో దాదాపు 60 రూములను ఈరోజు కోసం బుక్ చేసినట్లు తెలుస్తోంది.



సంబంధిత వార్తలు

New Guidelines for Air Passengers: విమాన ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం, ఇకపై ఫ్లైట్స్ భూమట్టానికి 3,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాతే వైఫై సేవలకు అనుమతి

Uttar Pradesh: వీడియో ఇదిగో, దేవాలయంలో ఏసీ నుంచి కారుతున్న నీటిని తాగేందుకు ఎగబడుతున్న భక్తులు, కోరి కోరి రోగాలు తెచ్చుకోవద్దంటున్న వైద్యులు

Low Pressure in Bay Of Bengal: బంగాళాఖాతంలో మ‌రోసారి అల్ప‌పీడనం, ఈ నెల 7 నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు

Fire Accident at Lord Balaji Temple: వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన స్వామి వారి పల్లకి, ఉత్సవ పీటలు.. పూర్తిగా కాలిపోయిన అద్దాల మండపం.. అరిష్టం అంటున్న వేద పండితులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)