Telangana Congress: టార్గెట్ కేటీఆర్ - హరీష్ రావు, కాంగ్రెస్ వ్యూహం ఇదేనా?, కాంగ్రెస్ కేడర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన గీతోపదేశం ఏంటీ?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతలేనా?, కురుక్షేత్రంలో కృష్ణార్జునులుగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?, ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి సాధించేది ఏంటీ?, ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Hyd, Aug 17: తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతలేనా?, కురుక్షేత్రంలో కృష్ణార్జునులుగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?, ఫలితంగా సీఎం రేవంత్ రెడ్డి సాధించేది ఏంటీ?, ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్ల పాటు పాలించేందుకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ పేరిట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ తీరును ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ అంతా హరీశ్ రావు, కేటీఆర్‌లపైనే ఉంది. అందుకే ఏ చిన్న అవకాశం దొరికినా వీరిద్దరిని వదలడం లేదు.
ముఖ్యంగా రుణమాఫీ విషయంలో హరీశ్ రావు రాజీనామా చేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. దీనిని హరీశ్ ఖండించగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు సైతం వెలిశాయి. మైనంపల్లి అభిమానుల పేరిట వెలసిన ఈ ఫ్లెక్సీల్లో అగ్గిపెట్ట హరీశ్ అంటూ తీవ్ర పదజాలాన్ని వాడారు. ఇది జరుతుండగానే సిద్దిపేటలోని హరీశ్ రావు ఇంటిపై కొంతమంది దాడికి పాల్పడగా ఇది కాంగ్రెస్ పనేనని మండిపడ్డారు. సిద్ధిపేటలో అర్ధరాత్రి హైడ్రామా.. హరీశ్ రావు క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి.. వీడియో వైరల్
ఇక కేటీఆర్ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన కామెంట్స్‌ను తమకు అనుకూలంగా మలుచుకుని దాడిని మరింత తీవ్రం చేశారు. అంతేగాదు మహిళా కమిషన్ సుమోటోగా నోటీసులు జారీ చేసే వరకు విషయం వెళ్లింది. అయితే కేటీఆర్ క్షమాపణ చెప్పిన కాంగ్రెస్ నేతలు మాత్రం వదలడం లేదు. మొత్తంగా బీజేపీని తెలంగాణ రాజకీయాల్లో డమ్మీని చేసి బీఆర్ఎస్‌ను బలహీనం చేస్తే కాంగ్రెస్‌దే భవిష్యత్ అని ఎత్తుగడలో ముందుకు వెళ్తున్నారు హస్తం పార్టీ నేతలు. మరి వారు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.