Komatireddy Rajagopal Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యలా కోమటిరెడ్డి? మేం 6 కోట్లే ఇస్తున్నాం, అందుకే పార్టీ మారడం లేదు?సంచలన కామెంట్స్ చేసిన రాజగోపాల్ రెడ్డి?

ఓ వైపు పాలన మరోవైపు పార్టీ పటిష్టత వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం పడిపోకుండా పార్టీ ఫిరాయింపులే టార్గెట్‌గా పనిచేస్తున్నారు.

Congress MLA Komatireddy Rajagopal Reddy sensational comments, CM Revanth Reddy in trouble!

Hyd, July 27: సీఎంగా, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నేతగా పక్కా ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ వైపు పాలన మరోవైపు పార్టీ పటిష్టత వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం పడిపోకుండా పార్టీ ఫిరాయింపులే టార్గెట్‌గా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటూ బీఆర్ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌లో వీలినమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు.

ఇక రేవంత్‌కు బయటిపార్టీల నుండి ముప్పు సంగతి పక్కన పెడితే తెలంగాణ రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నవారైన చెప్పేది సొంత పార్టీ నేతల నుండే పోటీ తప్పదని. ప్రధానంగా రేవంత్‌కు కొరకరాని కొయ్యలా మారేది కోమటిరెడ్డి బ్రదర్సే. వారు ఎప్పుడూ బాంబు పేల్చుతారో తెలియని పరిస్థితి.

తాజాగా మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పని చేసేశాడు. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు బీఆర్ఎస్‌ నుండి మరికొంత మంది ఎమ్మెల్యేల చేరిక ఉంటుందని చెప్పినా అలాంటిదేమి జరగేలేదు. చేరికలకు బ్రేక్ పడటంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా అనే వాదన వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు ప్రధానంగా బీజేపీకి మంచి ఛాన్స్ ఇచ్చేలా వ్యాఖ్యానించారు రాజగోపాల్ రెడ్డి. మీడియా చిట్‌చాట్ లో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు తాము కేసీఆర్ ఇచ్చినంత మొత్తం ఇవ్వలేకపోయామని అందుకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు. గతంలో కేసీఆర్ 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఇచ్చేవారని తాము కేవలం ఐదారు కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నామని అందుకే పార్టీ మారేందుకు ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదని తేల్చేశారు.

ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలోనే కాదు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మొత్తంగా అంతా ఊహించినట్లే సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాల నుండేమో కానీ సొంత పార్టీ నేతల నుండే తలనొప్పి ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రేకింగ్, ఆగస్టులోనే తెలంగాణ పంచాయతీ ఎన్నికలు?,ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు యదాతథం,త్వరలో నోటిఫికేషన్?



సంబంధిత వార్తలు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

Hyderabad Traffic Restrictions: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు, ఎల్బీ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు..వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif