Congress Suspends Teenmaar Mallanna: కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న క్రమశిక్షణ సంఘం

అంతా అనుకుందే జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ . పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పాల్పడుతున్న తిన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది క్రమశిక్షణ సంఘం.

Congress Party suspends MLC Teenmaar Mallanna(X)

అంతా అనుకుందే జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ(Congress Suspends Teenmaar Mallanna). పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పాల్పడుతున్న తిన్మార్ మల్లన్నకు ( Teenmaar Mallanna)షోకాజ్ నోటీసులు జారీ చేసింది క్రమశిక్షణ సంఘం. అయితే షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నా రెడ్డి. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తీరు, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు మల్లన్న. తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అంతేగాదు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన బీసీ కులగణనపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీ కులగణన పత్రాలను లైవ్‌లోనే కాల్చేశారు.

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు కన్నుల పండువగా వేడుకలు, అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

కులగణన తప్పుల తడక అని కావాలనే బీసీల సంఖ్యను తగ్గించారని విమర్శలు చేశారు. అంతేగాదు పార్టీ హైకమాండ్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఇక నిన్న పార్టీ కొత్త ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ వచ్చి 24 గంటలు గడవక ముందే మల్లన్నను సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

 

మల్లన్న సస్పెన్షన్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదు అన్నారు.  మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించాం కానీ మారలదేన్నారు. బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయింది.. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టం అని తేల్చిచెప్పారు.

 

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Congress Suspends Teenmaar Mallanna: కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న క్రమశిక్షణ సంఘం

Dy CM Pawan Kalyan Convoy Accident: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తికి గాయాలు.. వీడియో ఇదిగో..!

Fake Mouth Wash in Hyderabad: అక్కడ మౌత్‌వాష్‌లు కొంటున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే! హైదరాబాద్ చుడీ బజార్‌లో భారీగా ఫేక్‌మౌత్‌ వాష్‌లు స్వాధీనం

CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు

Share Now