Covid Second Wave in TS: తెలంగాణలో లాక్‌డౌన్ అవసరం లేదు, దాంతో పెద్దగా ఉపయోగం ఉండబోదు, కేసీఆర్ సమీక్షలతో కరోనా అదుపులోనే ఉంది, మీడియాతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

లాక్‌డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు.

Telangana CS Somesh Kumar | File Photo/ TS IPR

Hyderabad, May 5: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ (Lockdown) విధించబోవడం లేదని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (Chief Secretary Somesh Kumar) స్పష్టం చేశారు. లాక్‌డౌన్ విధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు. లాక్‌డౌన్ (Lockdown in TS) విధించి ప్రజలను ఇబ్బంది పెట్టడం కంటే, వారికి మంచి చికిత్స అందించడం ఎంతో ముఖ్యమన్నారు. అయితే, వారాంతపు లాక్‌డౌన్ విషయం గురించి మాత్రం ఆలోచిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై బుధవారం సీఎస్‌ అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని (Covid-19 second wave under control), అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించడంపై సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు ఆ నిర్ణయం తీసుకున్నాయన్నారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలు జీవనోపాధిని కోల్పోతారన్నారు. అయితే, రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అవసరమైనప్పుడు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటారని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు

ఈటెల భూమి కేసు..ప్రభుత్వంపై మండిపడిన హైకోర్టు, నోటీసులు ఇవ్వకుండా ఎలా విచారణ చేపడతారంటూ ఆగ్రహం, కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోరాదని ఆదేశాలు

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి బాగానే ఉందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి వైద్య సిబ్బంది చాలా కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. కరోనా కట్టడి చర్యలపై సీఎం కేసీఆర్‌ తమకు దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌ మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ క్యాపిటల్‌. ఇక్కడ ఇతర రాష్ట్రాల వారే ఎక్కువమంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఆక్సిజన్‌, మందుల కొరత లేదు. ఆక్సిజన్‌ బెడ్స్ పెంచాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌కు కరోనా సోకినా, ప్రతి నిత్యం తమతో సమీక్షలు చేశారని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం కోవిడ్‌ ఆస్పత్రుల్లో 62వేల బెడ్స్‌ ఉన్నాయి. తెలంగాణలో 135 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఒడిశా నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ నింపుకొని రావడానికి 6 రోజులు పడుతుంది. ఎయిర్‌లిఫ్ట్‌ చేయడం వల్ల మూడు రోజుల సమయం ఆదా అవుతోంది. కరోనా కట్టడికి ఎంత డబ్బు అయినా ఖర్చు చేయమని సీఎం చెప్పారు. తెలంగాణలో 90వేల రెమిడెసివిర్‌ వయల్స్‌ అందుబాటులో ఉన్నాయి. టోసిలిజుమాబ్‌ 63 వయల్స్‌ స్టాక్‌ ఉంది. అనవసరంగా ఆక్సిజన్‌, రెమిడెసివిర్‌ మందుల్ని వృథా చేస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది.. ఎవరూ భయపడొద్దు. కరోనా ట్రీట్‌మెంట్‌ కూడా చాలా సింపుల్‌గా ఉంది. సాధారణ మందులతోనే కరోనా తగ్గిపోతుంది. త్వరలోనే తెలంగాణలో సాధారణ పరిస్థితులు వస్తాయి’ అని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.

లాక్‌డౌన్‌పై నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదు? కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారు, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు, లాక్‌డౌన్‌పై ఈనెల 8 వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, తెలంగాణకు రావాల్సిన సిలిండర్లు, రెమిడేసివిర్ ఇంజక్షన్లను పంపమని అడిగామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 లక్షల కోవిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి జిల్లాలో ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. కొందరు అనవసరంగా రెమిడిసివిర్ ఇంజక్షన్లను వాడుతున్నారని, లక్షణాలుంటేనే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకూ 42 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ను అందించామని, 45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి వ్యాక్సిన్ అందుబాటులోనే ఉందని తెలిపారు.



సంబంధిత వార్తలు