Covid Vaccination: తెలంగాణలో నేటి నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్, ప్ర‌భుత్వ వ్యాక్సినేష‌న్ కేంద్రాల్లో టీకాలు, సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ, రాష్ట్రానికి చేరుకున్న 2.54 లక్షల డోసుల కోవిషీల్డ్‌ టీకాలు

ప్ర‌భుత్వ వ్యాక్సినేష‌న్ కేంద్రాల్లో టీకాలు ఇస్తున్నారు. సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది.

COVID-19 Vaccination (Photo Credits: PTI)

Hyderabad, May 25: తెలంగాణ రాష్ర్టంలో రెండో డోసు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ( second-dose-Coronavirus vaccination) ప్రారంభ‌మైంది. ప్ర‌భుత్వ వ్యాక్సినేష‌న్ కేంద్రాల్లో టీకాలు ఇస్తున్నారు. సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. వైరస్‌ను వ్యాపింపజేసే అవకాశమున్న సూపర్‌ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ (Telangana Vaccination) కార్యక్రమాన్ని నిర్వహించాలని.. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ (CM KCR) ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. రెండోడోస్‌ వ్యాక్సినేషన్‌ను మంగళవారం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను నిన్న ఆదేశించారు.

ఇదిలా ఉంటే లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద జనం పెద్దగి కనిపించడంలేదు. పదిరోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. రెండో డోస్ వ్యాక్సినేషన్‌పై సీఎం ఆదేశాలు జారీ చేశారు.వ్యాక్సినేషన్‌ విషయంలోనూ ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని, ఇందుకు ప్రత్యేక విధానం రూపొందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

తెలంగాణలో కొత్తగా 3,043 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా జీహెచ్ఎంసీలో 424 కొత్త కేసులు నమోదు, తాజాగా 4,693 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్

రాష్ట్రంలో జనవరి 16న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకాలు వేసిన ప్రభుత్వం.. తర్వాత 60ఏళ్లు నిండిన వారికి, ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారికి పంపిణీ మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 55లక్షల 26వేల 985 డోసులు పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు వేసుకున్న వారు 44లక్షల 53వేల 573 మంది ఉండగా… రెండు డోసులూ పూర్తయిన వారు 10లక్షల 73వేల 412 మంది ఉన్నారు.

అలర్డ్ న్యూస్..ఈ-పాస్ ఉంటేనే తెలంగాణ‌లోకి అనుమ‌తి, పోలీసుల కఠిన ఆంక్షలతో ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ ఆగిన వాహనాలు, అంబులెన్సులు, అత్యవసర సర్వీసుల వాహనాలకు మాత్రమే అనుమతి

రాష్ట్రానికి సోమవారం 2.54 లక్షల డోసుల కోవిషీల్డ్‌ టీకాలు వచ్చాయి. వీటితో కలిపి సుమారు 4లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక కోవాగ్జిన్‌ డోసులు 53 వేలు నిల్వ ఉండగా.. మంగళవారం మరో 50 వేల డోసులు రానున్నాయని వివరించారు. కాగా.. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మందికి కోవాగ్జిన్‌ రెండో డోసు ఇవ్వాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ నెల 1వ తేదీ నుంచే 18-45 ఏళ్ల మధ్య వారికి కూడా వ్యాక్సినేషన్‌ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినా.. టీకాల కొరతతో చాలా రాష్ట్రాల్లో ఈ వయసు వారికి టీకాల పంపిణీ జరగడం లేదు.