TS Corona Report: తెలంగాణలో తాజాగా 952 కరోనా కేసులు, కరోనాతో ఇప్పటివరకు 1,410 మంది మృతి, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 150 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 952 కరోనా పాజిటివ్ కేసులు (TS Corona Report) నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 2.58 లక్షలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గరు మృతి (Covid Deaths) చెందారు.
Hyd, Nov 17: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులిటెన్ ను విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 952 కరోనా పాజిటివ్ కేసులు (TS Corona Report) నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 2.58 లక్షలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గరు మృతి (Covid Deaths) చెందారు.
దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనాతో 1,410 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,732 యాక్టివ్ కేసులుండగా.. 2.43లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 150 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 68 కేసులు నిర్ధారణ అయ్యాయి.
భారత దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య (India Coronavirus) తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,163 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మధ్య కాలంలో 30 వేల లోపు కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. నిన్న ఒక్కరోజు 449 మంది మృత్యువాత (Covid Deaths) పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88.74,290కు చేరాయి.
మరణాల సంఖ్య 1,30,519కు చేరాయి. ప్రస్తుతం 4,53,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం దేశంలో 40,791 మంది కోలుకోగా ఇప్పటి వరకు 82,90,370 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో 93 శాతం రికవరీ రేటు ఉండగా.. మరణాల రేటు 1.47గా ఉంది. ఇక యాక్టివ్ కేసుల శాతం 5.11గా ఉంది.