GHMC Elections 2020: మోగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా, డిసెంబర్ 1న ఓటింగ్, డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌, నామినేష్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్‌ 20, నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 21వరకు..
Telangana's State Election Commissioner C Partha Sarathi (Photo Credits: ANI)

Hyderabad, November 17: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను (GHMC Elections 2020) దాంతోపాటు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డిసెంబర్‌ 1న ఓటింగ్‌ నిర్వహించి, డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌ చేపడతామని తెలిపారు. అవసరమైన చోట్ల డిసెంబర్‌ 3న రీ పోలింగ్‌ నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు. రేపటి నుంచి డివిజన్ల వారీగా నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు.

నవంబర్‌ 20 నామినేష్ల దాఖలుకు చివరి తేదీ అని, నవంబర్‌ 21 న నామినేషన్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. నవంబర్‌ 22న నామినేష్ల ఉపసంహరణకు చివరి తేదీ అని ఎస్‌ఈసీ తెలిపారు. డిసెంబర్‌ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ (Hyderabad Municipal Corporation Elections 2020 Schedule) ముగుస్తుందని చెప్పారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయని పార్థసారథి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.

ఎస్‌ఈసీ పార్థసారధి (SEC Parthasarathy) మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ( GHMC) ఎన్నికల్లో 2016లో ఏ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయో.. అవే రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. ఈనెల 13న ఓటర్ల తుది జాబితా పూర్తైంది. ఫిబ్రవరి 10తో జీహెచ్‌ఎంసీ పదవీకాలం ముగియనుంది. ప్రతి డివిజన్‌కు ఒక రిటర్నింగ్‌ అధికారి ఉంటారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తాం. గతంలో ఏపీ ఈసీకి బ్యాలెట్‌ బాక్సులు ఇచ్చాం.. ఇప్పుడు అవి తెచ్చుకుంటాం. ఈనెల 20న పోలింగ్‌ బూత్‌ల తుది వివరాలు వెల్లడిస్తాం. ప్రస్తుతం 9,200లకుపైగా పోలింగ్‌ కేంద్రాలున్నాయని పేర్కొన్నారు.

టిఎస్‌-బీపాస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, భవన నిర్మాణానికి 21 రోజుల్లో అనుమతులు వచ్చేలా చర్యలు, రియల్‌​ ఎస్టేట్‌ ధరలు పెంచవద్దని మంత్రి హెచ్చరిక

జనవరి 1, 2020 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వయోజనులు ఓటు వేసేందుకు అర్హులని తెలిపారు. బల్దియా పరిధిలో 52.09 శాతం పురుష, 47.90 శాతం మహిళా ఓటర్లున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 74 లక్షల 4 వేల మందికి పైగా ఓటర్లున్నారని వెల్లడించారు. అత్యధికంగా మైలార్‌దేవ్‌పల్లిలో 79,290 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా రామచంద్రాపురంలో 27,997 మంది ఓటర్లున్నారని ఎస్‌ఈసీ వివరించారు. బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.

గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించిన అప్ డేట్స్ 

జీహెచ్‌ఎంసీ పరిధిలో తక్షణమే అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌

డిసెంబర్‌ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌

మధ్యాహ్నం 12 గంటలకల్లా బ్యాలెట్‌ పేపర్లు సెపరేటు

మధ్యాహ్నం 3 గంటలకల్లా ఫలితాలు

ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500 నామినేషన్‌ డిపాజిట్‌

రిటర్నింగ్‌ అధికారి దగ్గరకు వచ్చే నామినేషన్లు దాఖలు చేయాలి

48 వేల మంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణ

తెలుగు రంగు బ్యాలెట్‌ పేపర్‌ వినియోగం

మొత్తం 2,700 పోలింగ్‌ కేంద్రాలు

1439 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,004

అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 257

జీహెచ్‌ఎంసీ వార్డుల వారీగా రిజర్వేషన్లు

గ్రేటర్‌ మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌

బీసీ -50: (జనరల్‌ 25, మహిళలు 25)

ఎస్సీ -10: (జనరల్‌ 5, మహిళలు 5)

ఎస్టీ-2: (జనరల్‌ 1, మహిళ 1)

జనరల్‌ -44

జనరల్‌ మహిళ -44