Traffic Restrictions in Cyberabad: సైబరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు, సైబర్స్ టవర్స్ నుంచి వెళ్లే వారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ ల్యాండింగ్ నుంచి యశోద హాస్పిటల్ వరకు కొత్తగా సర్వీసు రోడ్డు నిర్మిస్తుండడంతో.. 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Hyderabad, SEP 13: ఈ నెల 14వ తేదీ నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు (Cyberabad Police) వెల్లడించారు ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ ల్యాండింగ్ నుంచి యశోద హాస్పిటల్ వరకు కొత్తగా సర్వీసు రోడ్డు నిర్మిస్తుండడంతో.. 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సైబర్ టవర్స్ (Cyber Towers), 100 ఫీట్ జంక్షన్, కొత్తగూడ నుంచి జేఎన్టీయూ, మూసాపేట్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
Here's Tweet
టాడీ కంపౌండ్ నుంచి జేఎన్టీయూ, మూసాపేట్ వెళ్లే వాహనదారులు 100 ఫీట్ జంక్షన్ మీదుగా ఖైతలాపూర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
ఐకియా, సైబర్ గేట్ వే, సీవోడీ జంక్షన్ నుంచి జేఎన్టీయూ వైపు వెళ్లే వాహనాలు సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ మీదుగా నేరుగా జేఎన్టీయూ వెళ్లొచ్చు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.