Cyclone Michaung: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం, పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్, మరో రెండు రోజుల పాటు భారీ వానలు, ఎల్లో, ఆరంజ్ అలర్ట్ జారీ

కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది.ఈ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

Hyderabad Rains (Photo-X)

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది.ఈ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్,కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట, జగద్గిరీ గుట్ట, కుత్బుల్లాపూర్, సుచిత్ర, అల్వాల్, రాయదుర్గం,బహదూర్పల్లి, సూరారం, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, ఆల్విన్ కాలనీ మూసాపేట, ప్రగతినగర్, నిజాంపేటలో వర్షం పడుతోంది.

డిసెంబర్ 5 తెల్లవారుజామున నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇక జగిత్యాల జిల్లాలో కురుస్తోన్న వర్షానికి ధాన్యం అంతా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది.

కాసేపట్లో నెల్లూరు తీరాన్ని మైచాంగ్ తుఫాన్ దాటేందుకు సిద్ధం, అప్రమత్తమైన తీరప్రాంతాలు.. తిరుపతి నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కరీంనగర్‌, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీచేసింది.

వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు, ఎయిర్‌పోర్ట్‌లోకి భారీగా వరద, మిచాంగ్ తుఫాను విధ్వంసానికి చెన్నై ఎలా విలవిలలాడుతుందో వీడియోల్లో చూడండి

సైక్లోన్ ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, యెల్లో అలర్ట్ లు జారీ చేసింది. సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, యాదాద్రి భుననగిరి, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్ జిల్లాలకు మాత్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది.



సంబంధిత వార్తలు

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి