Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు, కవిత పిటిషన్‌పై తుది విచారణ ఈ నెల 16కి వాయిదా, అన్ని కేసులను అదే రోజు ఉమ్మడిగా విచారిస్తామని తెలిపిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.తుదివిచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోరారు

Telangana Rashtra Samithi leader K Kavitha. (Credits: Facebook)

Hyd, Feb 5: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.తుదివిచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోరారు. గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులు, రికార్డులను పరిశీలించాల్సి ఉందని పేర్కొంటూ జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం ఈ నెల 16కు విచారణ వాయిదావేసింది. అదే రోజున తుది విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితకు మరోసారి ఈడీ నోటీసులు, రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపిన ఈడీ

ఈరోజు విచారణ సందర్భంగా ఈడీ నోటీసులకు కవిత (BRS MLC Kavitha petition) హాజరుకావడంలేదని అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ ​క్రమంలో ఈడీ నోటీసులను సవాల్‌ చేయడం వల్లే హాజరు కాలేదని కవిత తరఫు లాయర్‌ కపిల్‌ సిబల్‌ తెలిపారు. అనంతరం కోర్టు అభిషేక్‌ బెనర్జీ, నళిని చిదంబరం, కవిత కేసులను ఉమ్మడిగా విచారిస్తామని స్పష్టం చేసింది. ఈనెల 16వ తేదీన తుది వాదనలకు సిద్ధంగా ఉండాలని కోర్టు సూచించింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో (Delhi Liquor Scam Case) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. దీంతో, ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని పిటిషన​్‌ దాఖలు చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Nalgonda Fake Journalists: నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల హల్చల్.. ఓ సీఐని బెదిరించి రూ. 5 లక్షలు డిమాండ్, పలువురు పోలీసులను బ్లాక్‌మెయిల్, వివరాలివే

Kisan Credit Card: కిసాన్‌ క్రెడిట్‌ కార్డుతో రైతులు రూ. 5 లక్షలు రుణం పొందవచ్చు, లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి, అలాగే Kisan Credit Card ఎలా పొందాలో వివరాలు మీకోసం..

KTR unveils Ambedkar Statue: రేవంత్ రెడ్డికి తిట్ల పురాణం త‌ప్ప ఏం రాదు..కేసీఆర్‌కు, రేవంత్‌కు పోలిక‌నే లేదు మండిపడ్డ కేటీఆర్, కొడంగ‌ల్‌కు దండ‌యాత్ర‌లా వ‌స్తాం అని హెచ్చరిక

Union Budget 2025 Highlights: రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే, రక్షణ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం, రంగాల వారీగా బ‌డ్జెట్ కేటాయింపులు, నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగం హైలెట్స్ మీకోసం..

Share Now