ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మరోసారి నోటీసులు పంపించింది.రేపు(మంగళవారం) ఈ కేసులో విచారణను హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. గతేడాది మార్చిలో కవితను ఈడీ పలుమార్లు విచారించింది. కాగా, ఈడీ నోటీసులపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికి నాలుగుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చిన ఆయన హాజరుకాలేదు. ఇక, లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఈడీ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)