CM KCR In Nirmal: ఈ నెల 24 నుంచి పోడు భూముల పంపిణీ : సీఎం కేసీఆర్ ప్రకటన...నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
ఈ సీజన్ నుంచే రైతుబంధు అందించే పనిలో ప్రభుత్వం ఉంది. వారి బ్యాంకు ఖాతాలు సేకరించాలన్నారు.
నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం ప్రారంభించారు. మొదట కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్ సీటులో వరుణ్ రెడ్డిని కూర్చండబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
సమిష్టి కృషితోనే అద్భుత పురోగతి సాధించాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నాలుగు మెడికల్ కాలేజీలు. తాగు, సాగు నీటి సమస్యను అధిగమించాం. 24 నుంచి పోడు భూముల పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ పోడు భూముల పంపిణీని బ్రహ్మాండంగా నిర్వహించాలి. ఈ సీజన్ నుంచే రైతుబంధు అందించే పనిలో ప్రభుత్వం ఉంది. వారి బ్యాంకు ఖాతాలు సేకరించాలన్నారు.