Telangana EV Policy: ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ ధరలు ఇంత తక్కువా..? అంతేకాదు ఈ రేంజ్‌లో సబ్సిడీ ఇస్తుంటే ఇక ఈవీని ఎవరు ఆపలేరు, ఈవీ చార్జింగ్ రేట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనలను ప్రతి కిడబ్ల్యుహెచ్‌కు రూ.12.06 + జిఎస్టీ చెల్లించి ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు అని తెలిపింది.

Electric Vehicle

Hyderabad December 12: ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicle)ను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలను చేపడుతున్నాయి. సబ్సిడీ(Subsidy)లతో పాటూ చార్జింగ్ స్టేషన్ల(charging stations) ఏర్పాటను శరవేగంగా చేస్తున్నాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana govt) ఒక అడుగు ముందుకేసింది. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicle) కొనుగోళ్లు పెరగడంతో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల(Charging stations)ను ఏర్పాటు చేయడంతో పాటు, ఈవీలను ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జింగ్ చేసుకుంటే ఎంత ధర చెల్లించాలో(EV charging prices) కూడా ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనలను ప్రతి కిడబ్ల్యుహెచ్‌కు రూ.12.06 + జిఎస్టీ చెల్లించి ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ కొత్త ధరలు వచ్చే ఏప్రిల్ నెల నుంచి వర్తించనున్నాయి.

ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాల(Electric vehicle) బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలో వాట్‌కు రూ.15 వేల చొప్పున సబ్సిడీని ప్రభుత్వం అందించనుందని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(TSREDCO) స్పష్టం చేసింది. టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్‌ వీలర్‌ తేడా లేకుండా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ వాహనాలకు(Electric vehicle) ఈ సబ్సిడీ వర్తిస్తుందని చెప్పారు. రూ.10 లక్షల విలువైన వాహనాల వరకూ సబ్సిడీ ఉంటుందన్నారు. ఫేమ్ 2 స్కీమ్ కింద హైదరాబాద్ అంతటా సుమారు 118పబ్లిక్ వేహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.

Electric Vehicles Registration Fee: బ్యాటరీతో నడిచే వాహానాలకు రిజిస్ట్రేషన్ రుసుము ఎత్తివేత, కేంద్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.

హైదరాబాద్‌(Hyderabad)తో పాటు వరంగల్(Warangal), కరీంనగర్(Karimnagar) పట్టణాలలో మరో 20 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ మొత్తం 138కి చేరుకోనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని కొన్ని ప్రదేశాలలో ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లు(Private Charging Stations) ఉన్నాయి. ఇవన్నీ వచ్చే మార్చి నాటికి సిద్ధం కానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనలను ప్రతి కిడబ్ల్యుహెచ్‌కు రూ.12.06 + జిఎస్టీ చెల్లించి ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. ఇది పెట్రోల్ & డీజిల్ కంటే చాలా చౌక అన్నారు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటాకు చెందిన 30.2 కిడబ్ల్యుహెచ్‌ బ్యాటరీ గల టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ కారును ఫుల్ చార్జ్ చేయడానికి రూ.360 అయితే, అదే పెట్రోల్, డీజిల్ కార్ల కోసం అయితే 3 లీటర్ల పెట్రోల్ కూడా రాదు. ఇక ఇంటి వద్ద ఎలక్ట్రిక్ వాహనలను ఛార్జింగ్ చేసుకుంటే కిడబ్ల్యుహెచ్‌కు కేవలం రూ.6 మాత్రమే అవుతుంది అని అన్నారు.