Electric Vehicles Registration Fee: బ్యాటరీతో నడిచే వాహానాలకు రిజిస్ట్రేషన్ రుసుము ఎత్తివేత, కేంద్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.
Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

న్యూఢిల్లీ, జూన్ 20: ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ రుసుము (Registration Fee) నుంచి మినహాయింపు (Exemption) పై ఒక ప్రతిపాదన చేసింది.

ఇందుకోసం కేంద్ర రహాదారులు మరియు రవాణా మంత్రిత్వ శాఖ (The Ministry of Road Transport and Highways)  తగిన ఏర్పాట్లను చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు విషయంలో 1889 కేంద్ర మోటార్ వాహానాల చట్టం (Central Motor Vehicles Rules) లో కొన్ని సవరణలు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇది అమలులోకి వస్తే బ్యాటరీతో నడిచే 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ వాహానాలకు రిజిస్ట్రేషన్ లేదా రిన్యువల్ సర్టిఫికెట్స్ పొందేందుకు ఇకపై ఎలాంటి ఫీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించటం ద్వారా పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం తగ్గుతుంది తద్వార వాయు కాలుష్యం తగ్గించడతో పాటు, చమురు దిగుమతుల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.