Hyderabad: కాంగ్రెస్‌లోకి తుమ్మల ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్, సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిన మాజీ మంత్రి, స్వయంగా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ ముఖ్యనేతలు

దీంతో పాటు పలు అంశాలపై కాంగ్రెస్ నేతలు తుమ్మలతో చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్‌లో జిట్టా బాలకృష్ణారెడ్డి, యొన్నం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.

Tummala Nageswara Rao

Hyderabad, SEP 15:   కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తుమ్మలతో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో తుమ్మల నివాసానికి ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో.చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రోహిన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు వెళ్లి మంతనాలు సాగించారు. ఈ సందర్భంగా తుమ్మలను ఠాక్రే పార్టీలోకి ఆహ్వానించారు. తుక్కుగూడ విజయభేరీ సభలో పార్టీలో చేరాలని సూచించారు. కాగా ఇప్పటికే బీఆర్‌ఎస్‌పై అసంతృప్తిని వెళ్లగక్కుతున్న తుమ్మల ఇక రేపో మాపో కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అనిపిస్తోంది.

 

తాజ్‌ కృష్ణా హోటల్‌లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు సమాచారం. దీంతో పాటు పలు అంశాలపై కాంగ్రెస్ నేతలు తుమ్మలతో చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్‌లో  జిట్టా బాలకృష్ణారెడ్డి, యొన్నం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.



సంబంధిత వార్తలు

Andhra Tourist Killed in Goa: గోవాలో ఏపీ యువకుడు దారుణ హత్య, న్యూఇయర్ వేళ తీవ్ర విషాదం, నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

CM Revanth Reddy: ప్రజలకు అందుబాటులో ఉండండి..పాత, కొత్త నాయకులు అంతా కలిసి పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ త్వరలో వెల్లడిస్తానన్న ముఖ్యమంత్రి

Maoist Tarakka Surrendered: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ, కేంద్ర కమిటీ సభ్యుడు వేణుగోపాల్ భార్య తారక్క లొంగుబాటు, మహారాష్ట్ర సీఎం ఎదుట మరో 10 మందితో పాటూ జనజీవనస్రవంతిలోకి మావోయిస్టులు

Food Tips: టిఫిన్ బాక్స్ లోకి సింపుల్ గా ఈజీగా రెడీ అయ్యే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇలా ఈజీగా తయారు చేసుకోండి..