Jithender Reddy Joined in Congress: కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, చేరిన వెంటనే కేబినెట్ హోదాతో పదవి దక్కించుకున్న జితేందర్ రెడ్డి
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ .. కాంగ్రెస్ కండువా కప్పి (Jithender Reddy Joined in Congress) జితేందర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.
Hyderabad, March 15: బీజేపీ నేత, మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి (Jithender Reddy) శుక్రవారం రాత్రి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ .. కాంగ్రెస్ కండువా కప్పి (Jithender Reddy Joined in Congress) జితేందర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్‌రెడ్డికి బీజేపీ అవకాశం కల్పించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం జితేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే ఆయనను పదవి వరించింది. దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా (క్రీడా వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.