Munugode Exit Polls: మునుగోడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయోచ్.. ఆ పార్టీదే విజయమట.. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ లో ఏ ఏజెన్సీ ఏం చెప్పింది? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి??
పోలింగ్ గడువు ముగిసిన తర్వాత మునుగోడు ఎన్నికల ఫలితాలపై పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే విజయం దక్కుతుందని తేల్చేశాయి.
Munugode, Nov 4: తెలంగాణలో (Telangana) సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు (Munugode) ఉప ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రంతో ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ (Polling) నమోదు కాగా... మొత్తంగా 93.13 శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం. పోలింగ్ గడువు ముగిసిన తర్వాత మునుగోడు ఎన్నికల ఫలితాలపై (Results) పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే విజయం దక్కుతుందని తేల్చేశాయి.
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో అధికార టీఆర్ఎస్ 40.9 శాతం ఓట్లతో విజయం సాధిస్తుందని తేలింది. అదే సమయంలో బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 23 శాతం ఓట్లు, బీఎస్పీకి 3.2 శాతం ఓట్లు, ఇతరులకు 1.9 శాతం ఓట్లు వచ్చాయి. ఇక త్రిశూల్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో అధికార టీఆర్ఎస్ కు ఏకంగా 47 శాతం ఓట్లు రాగా... బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 18 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు రానున్నట్లు తేలింది.