Farmers Protest On Rythu Bharosa: తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆందోళన, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్, రాజీవ్ రహదారిపై రాస్తారోకో

మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పర్దిపూర్ గ్రామంలో డప్పు చప్పుళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం శవ యాత్రను ఊరేగింపుగా నిర్వహించి చౌరస్తాలో దగ్ధం చేశారు రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.

Farmers protest demanding immediate release of Rythu Bharosa(Video grab)

Hyd, Oct 20: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పర్దిపూర్ గ్రామంలో డప్పు చప్పుళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం శవ యాత్రను ఊరేగింపుగా నిర్వహించి చౌరస్తాలో దగ్ధం చేశారు రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు.

ఆర్మూర్ మండలం మాణిక్ బండారు చౌరస్తాలో ఖరీఫ్ పంటకు రైతు భరోస ఇవ్వటం లేదని నిరసనగా ఆర్మూర్ నుండి నిజామాబాద్ రహదారిపై రైతుల రాస్తారోకో భారీగా నిలిచిపోయిన వాహనాలు పాల్గొన్నారు బీఆర్ఎస్ నాయకులు, రైతులు. ఇక గజ్వేల్‌లో దుద్దెడ వద్ద రాజీవ్ రహదారి పై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో చేసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

నల్గొండ జిల్లా చండూర్ లోని స్థానిక చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా చేత కానీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు రైతులు. వరంగల్ జిల్లా నర్సంపేట తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతు భరోసా ఎగవేతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

మహేశ్వరంలో రైతు భరోసా వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలమేరకు మహేశ్వరం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం అందచేసి, సీఎం దిష్టి బొమ్మ దహనం చేసి, సీఎం డౌన్ సీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ నాయకులు.  ఎగువ నుంచి ప్రవాహం.. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తివేత.. వీకెండ్ కావడంతో సందడిగా పరిసరాలు 

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు భరోసా వెంటనే ఇవ్వాలంటూ నిరసన చేపట్టగా హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఎగవేతను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాజీపేట చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండల కేంద్రంలో దిష్టి బొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు.



సంబంధిత వార్తలు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం