TSRTC Goodnews for Medaram Jatara: తెలంగాణ మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మేడారం జాతర సమయంలో మహిళలకు ప్రయాణం ఉచితం.. అయితే, తొలుత మహిళలకు టికెట్ వసూలు చేయాల్సిందేనన్న సజ్జనార్.. వద్దన్న మంత్రి భట్టి విక్రమార్క.. చివరకు ఫ్రీ బస్ ప్రయాణమే ఖరారు.. వచ్చే నెల 18 నుంచి 25 వరకు మేడారం జాతర.. 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ

జాతరకు నడిపే ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతర సమయంలో మహిళల నుంచి టికెట్ వసూలు చేయాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తోసిపుచ్చారు.

Medaram Sammakka Saralamma Jatara (Photo-Twitter)

Hyderabad, Jan 27: మేడారం జాతరకు (Medaram Jatara) వెళ్లే తెలంగాణ మహిళలకు సర్కారు గుడ్ న్యూస్ (Goodnews) చెప్పింది. జాతరకు నడిపే ప్రత్యేక బస్సుల్లో (Special Buses) కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతర సమయంలో మహిళల నుంచి టికెట్ వసూలు చేయాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తోసిపుచ్చారు. అసలేం జరిగిందంటే.. రాష్ట్ర బడ్జెట్‌ కు సంబంధించి భట్టి, రవాణశాఖమంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న మేడారం జాతర సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి టికెట్ వసూలు చేస్తే సంస్థ ఆదాయం పెరుగుతుందని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన భట్టి.. అది సరికాదని, ఎట్టిపరిస్థితుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక్క మేడారమే కాదని, ఏ జాతర సమయంలోనూ మహిళల నుంచి టికెట్ వసూలు చేయవద్దని ఆదేశించారు.

BRS Parliamentary Party Meeting: త్వరలోనే ప్రజల్లోకి వస్తా! ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడుదామంటూ ఎంపీలకు కేసీఆర్ పిలుపు

హైదరాబాద్ నుంచి 2 వేల ప్రత్యేక బస్సులు

వచ్చే నెల 18 నుంచి 25 వరకు జరగనున్న మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 6 వేల బస్సులు నడపాలని నిర్ణయించింది. ఒక్క హైదరాబాద్ నుంచే 2 వేల బస్సులను సిద్ధం చేస్తున్నారు.

Lok Sabha Elections 2024: ఈ సారి ఎన్నికల్లో ఓటు వేయనున్న 96 కోట్ల మంది ఓటర్లు, వారిలో 47 కోట్ల మంది మహిళలే, వివరాలను వెల్లడించిన ఎన్నికల కమిషన్ 

 



సంబంధిత వార్తలు