Good News For TSRTC Workers: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, మరో డీఏ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం, సెప్టెంబర్ నెల వేతనంతోనే డీఏ చెల్లింపు

మరో డీఏ (DA) ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏని చెల్లింపు చేయనుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సిన 5శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేసింది. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను (DA) ఉద్యోగులకు చెల్లింపు చేయనుంది.

Electric AC Bus (Photo-Twitter)

Hyderabad, SEP 02: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (TSRTC). మరో డీఏ (DA) ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏని చెల్లింపు చేయనుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సిన 5శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేసింది. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను (DA) ఉద్యోగులకు చెల్లింపు చేయనుంది. ఇప్పటివరకు 8 డీఏలను సంస్థ మంజూరు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు (TSRTC) కష్టపడి పని చేస్తున్నారని.. పెండింగ్‌ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు.

YSR Rythu Bharosa: రైతుల అకౌంట్లోకి నేరుగా రూ. 7,500, బటన్ నొక్కి కౌలు అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ ఏమన్నారంటే.. 

మరో విడత డీఏ చెల్లించాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పట్ల టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పందించాయి. ”పెండింగ్ డీఏ విడుదలను స్వాగతిస్తున్నాము. ప్రస్తుత చెల్లింపు డీఏతో మొత్తం 8 డీఏలు యాజమాన్యం చెల్లించింది. పెండింగ్ డీఏ చెల్లింపుతో పాటు 169 నెలల డీఏ అరియర్స్ చెల్లించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతోంది. కాబట్టి పెండింగ్ బకాయిలతో పాటు డీఏ అరియర్స్ కూడా చెల్లిస్తే కార్మిక కుటుంబాలకు ఉపయోగంగా ఉంటుంది” అని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్పాయి.