Graduate MLC By Election: తెలంగాణ‌లో ఉప ఎన్నికకు ముగిసిన ప్ర‌చారం, సోమ‌వారం రోజు పోలింగ్, మూడు ఉమ్మ‌డి జిల్లాల్లో క‌లిపి ఎంత‌మంది ఓట‌ర్లున్నారంటే?

దీంతో 48 గంటల పాటు సైలెన్స్ పిరియడ్ ఉండనుంది. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ (polling) జరగనుంది. 605 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Polling (Credits: X)

Hyderabad, May 25: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల (Graduate MLC By Election) ప్రచారం ముగిసింది. దీంతో 48 గంటల పాటు సైలెన్స్ పిరియడ్ ఉండనుంది. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ (polling) జరగనుంది. 605 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34 అసెంబ్లీ నియోజక వర్గాలలో విస్తరించి ఉంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం.ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 1,73,406 మంది గ్రాడ్యుయేట్ (Graduates) ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,985 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు ఎన్నో వ్యూహాలు అమలు చేశాయి.

KTR Fire on Jupally: బీఆర్ఎస్ నేత హ‌త్య వెనుక మంత్రి జూప‌ల్లి ప్ర‌మేయం, ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు చేస్తున్నారంటూ మండిప‌డ్డ కేటీఆర్ 

ఆయా పార్టీల కీలక నేతలు అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డికి మద్దతుగా కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ తో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)కు మద్దతుగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు.



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Priyanka Gandhi: మీ కోసం పోరాడుతా..తనపై నమ్మకం ఉంచి రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక గాంధీ..ప్రజల వ్యక్తిగా పనిచేస్తానని వెల్లడి

Priyanka Gandhi: ఆరంభం అదుర్స్‌..రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ చేసిన ప్రియాంక గాంధీ, వయనాడ్‌లో 4 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపు..కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు