Graduates MLC By Poll Result: ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో ఆధిక్యంలో తీన్మార్ మ‌ల్ల‌న్న‌, ఇవాళ రాత్రికి తుది ఫ‌లితం వెల్ల‌డ‌య్యే అవ‌కాశం

మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన 3.36 లక్షల బ్యాలెట్‌ పత్రాలను 25 చొప్పున తొలుత కట్టలు కట్టారు. ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం నాలుగు గదుల్లో 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

Teenmar Mallanna (Photo-Video Grab)

Nalgonda, June 06: వరంగల్‌ -ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు (Graduates MLC Counting) రెండో రౌండ్‌ పూర్తయింది. ప్రస్తుతం మూడో రౌండ్‌ కౌంటింగ్‌ సాగుతోంది. మొదటి రౌండ్‌లో 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న.. (Teenmar Mallanna) రెండో రౌండ్‌లోనూ లీడ్‌లో కొనసాగారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్‌లో ఆయనకు 34,575 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి (Rakesh Reddy)27,573 ఓట్లు , బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 12,841 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు రెండో రౌండ్‌లో 11,018 ఓట్లు వచ్చాయి.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు, 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ 

నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో బుధవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. మొత్తం 605 పోలింగ్‌ కేంద్రాల్లో పోలైన 3.36 లక్షల బ్యాలెట్‌ పత్రాలను 25 చొప్పున తొలుత కట్టలు కట్టారు. ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం నాలుగు గదుల్లో 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు.

ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక జరిగింది.



సంబంధిత వార్తలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ