IPL Auction 2025 Live

CM Revanth Reddy America Tour: అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ఘన స్వాగతం, పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల టూర్

శనివారం హైదరాబాద్ నుండి అమెరికాకు బయలుదేరగా సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల టూర్ ఉండనుంది.

Grand Welcome for CM Revanth Reddy at America, to meet MNCs in US, South Korea(X)

Hyd, Aug 4: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా చేరుకున్నారు. శనివారం హైదరాబాద్ నుండి అమెరికాకు బయలుదేరగా సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల టూర్ ఉండనుంది.

అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు రేవంత్ రెడ్డి. అలాగే న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు.

తొలుత అమెరికా ఆ తర్వాత దక్షిణా కొరియాలో పర్యటించనున్నారు. మొత్తం పది రోజుల ప‌ర్యాట‌న‌లో భాగంగా సీఎం బృందం పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆగస్టు 6న ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. మూసీ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న మిగతా ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి భాగస్వాములు కావాలని కోరనున్నారు. మూడు నెలల్లో ఎల్‌ఆర్‌ఎస్ పూర్తి చేయాలి, దళారుల ప్రమేయం వద్దు,అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు 

Here's Video:

అమెజాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కాగ్నిజెంట్‌ సీఈవో, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ సీవోవో, పెప్సీ కో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రముఖులతో సీఎం బృందం భేటీ కానుంది. అమెరికా నుండి దక్షిణకొరియాలో పర్యటించి అక్కడ పారిశ్రామిక వేత్తలను కలవనున్నారు రేవంత్. అనంతరం ఆగస్టు 14న హైద‌రాబాద్‌కు తిరిగి చేరుకోనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేపట్టడం ఇది రెండోసారి.



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి