H3N2 Virus Spread: హెచ్3ఎన్2 వైరస్ కల్లోలం, తెలుగు రాష్ట్రాలకు ఐసీఎమ్ఆర్ అలర్ట్ బెల్, వైరస్‌కు అడ్డుకట్ట వేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచన
అన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలకు (two Telugu states) ఐసీఎమ్ఆర్ అలర్ట్ బెల్ జారీ చేసింది.
Hyd, Mar 14: దేశాన్ని కరోనా కుదిపేసిన సంఘటనలు మరువకముందే మరో వైరస్ హెచ్3ఎన్2 భారతదేశాన్ని వణికిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలకు (two Telugu states) ఐసీఎమ్ఆర్ అలర్ట్ బెల్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus Spread) వేగంగా వ్యాపిస్తోందంటూ ఐసీఎమ్ఆర్ (ICMR) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు జరుగుతుండడం, వైద్యం కోసం తెలుగు రాష్ట్రాలకు క్యూకడుతున్న విదేశీయులు, ఊపందుకున్న పర్యాటకం వెరసి..హెచ్3ఎన్2 వైరస్ వేగంగా వ్యాపించేందుకు కారణమవుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
దీనికి తోడు ప్రజలు మాస్కులు వాడటం లేదని కూడా పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నాయి. కొవిడ్, చికున్‌గున్యా నిర్ధారణ పరీక్షల కోసం వినియోగించిన ఎక్విప్‌మెంట్‌తోనే హెచ్3ఎన్2 వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు రెడీ అవుతున్నారు.