Harish Rao on Six Guarantees: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా? మీడియాకు హరీష్ రావు ఇచ్చిన సమాధానం ఇదే!
రారో.. మీరే చూస్తారన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడుతామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల చట్టబద్ధత కోసం పోరాడుతామన్నారు. రెండు విడతల రైతుబంధు ఇవ్వాలని అసెంబ్లీలో పట్టుబడుతామని.. ప్రజాసమస్యలపై గళం విప్పుతామన్నారు.
Hyderabad, DEC 08: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ (KCR) వస్తారో.. రారో.. మీరే చూస్తారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో సమావేశమయ్యారు. సమావేశానికి మండలి విపక్ష నేత మధుసూదనా చారి, కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలల్లో సమస్యలపై నివేదికను కేసీఆర్‌కు అందజేశారు. గురుకులాల బాట ద్వారా అధ్యయనం చేసిన తర్వాత నివేదికను కేసీఆర్‌కు అందజేసింది. నివేదికను ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (BRSV) అందజేసింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
Harish Rao on Implementation Of Congress Six Guarantees
ఎర్రవల్లి ఫాంహౌస్ వద్ద కేసీఆర్‌ను (KCR) తాజామాజీ సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ సర్పంచుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. రేపు ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తున్నామని తెలిపారు. గతంలో రేవంత్ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చూడాలని కోరారు. సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారో.. రారో.. మీరే చూస్తారన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడుతామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల చట్టబద్ధత కోసం పోరాడుతామన్నారు. రెండు విడతల రైతుబంధు ఇవ్వాలని అసెంబ్లీలో పట్టుబడుతామని.. ప్రజాసమస్యలపై గళం విప్పుతామన్నారు.