Harishrao On CM Revanth Reddy: రేవంత్..నీది నోరా మోరా?, మూసీ సుందరీకరణ కోసం లక్షా యాభై వేల కోట్లు అని చెప్పలేదా?,దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ బాధితుల దగ్గరికి వెళ్దామని ఛాలెంజ్‌

సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్. పోదాం పదా...డేట్, టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్దం అని తేల్చిచెప్పారు.

Harish rao Open Challenge to CM Revanth Reddy on musi river project(X)

Hyd, Oct 18: సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. రేవంత్..నీది నోరా మోరా?,మూసీ సుందరీకరణ కోసం లక్షా యాభై వేల రూపాయలు ఖర్చుపెడతామని నీ నోటితో నువ్వే చెప్పి, ఇప్పుడు సిగ్గులేకుండా రోజుకో మాట మాట్లాడుతున్నవ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్. పోదాం పదా...డేట్, టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్దం అని తేల్చిచెప్పారు.

ఫొర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా ప్రజల పైన ప్రేమ ఉంటే మూసిలోకి మురికి నీరు పోకుండా కాపాడాలన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మూసి కి వ్యతిరేకం కాదన్నారు. గుర్రాలతో ఆశా వర్కర్లను తొక్కించిన సంస్కృతి నీ కాంగ్రెస్ పార్టీది, నువ్వు గతంలో ఉన్న తెలుగు దేశం పార్టీది అన్నారు. ఆశా వర్కర్లను, అంగన్వాడీలను అసెంబ్లీ ముందు గుర్రాలతో తొక్కించిన చరిత్ర నీ కాంగ్రెస్ పార్టీది అని దుయ్యబట్టారు. పెంచిన కరెంట్ బిల్లులను తగ్గించమని చెప్పితే గుర్రాలతో తొక్కించిన ఘనత గతంలో నువ్వున్న టీడీపీ పార్టీది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్...అమాయక ప్రజలు ఇల్లు కూలగొట్టడానికి వ్యతిరేకం,నీ రియల్ ఎస్టేట్ దందాలకు వ్యతిరేకం రేవంత్ రెడ్డి అన్నారు. గండిపేట, ఉస్మాన సాగర్ కట్టిన తరవాత వరదలు రాలేవు కదా బఫర్ జోన్ కి ఎందుకు వెళ్తున్నావ్ అన్నారు. హైడ్రా పేరుతో ప్రజలను భయబ్రాంతాలకు గురి చేస్తున్నారు అన్నారు. ముందు మూసి నిర్వాసితుల వద్దకు, ఆ తర్వాత ఆర్ అండ్ ఆర్ కాలని, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కట్ట మీదకు పోదాం అక్కడే కూర్చొని మాట్లాడుదాం అని తేల్చిచెప్పారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చలేక నీతిమాలిన పద్ధతిలో మాట్లాడుతున్నారని....ముఖ్యమంత్రి మాటలు చూసి చిన్న పిల్లలు నవ్వుకుంటున్నారు అన్నారు. హైదరాబాద్ చుట్టూ సముద్రాలూ ఉన్నాయి అంటాడు, మూసి మాత్రమే నగరాలు ప్రవహించే నది ఒక్కటే అని మాట్లాడతారు ...సీఎం కుర్చీ గౌరవాన్ని రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నారన్నారు. మూసి పునర్జవం కావాలంటే, మురికి నీరు రాకుండా అరికట్టాలని...కానీ ఇల్లు కూలగొట్టి గోల్‌మాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  మూసీ సుందరీకరణ కాదు పునరుజ్జీవం, డీపీఆరే పూర్తి కాలేదు...లక్షన్నర కోట్లు అంటూ అసత్య ప్రచారం చేస్తారా...సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ 

Here's Video:

మల్లన్న సాగర్ ప్రజలకు ఒక్క ఇల్లు అయన కట్టి ఇచ్చారా అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతాడు...నాలుగువేల ఇండ్లు కట్టించామని తెలిపారు హరీశ్‌. భూసేకరణ చట్టం కన్నా ఎక్కువగా ఇచ్చామన్నారు. 250 గజాల స్థలంతో పాటు 5 రకాల బెనిఫిట్స్ ఇచ్చామన్నారు. కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్‌ ఇండ్లను బాధితులకు ఇచ్చి తానే ఇచ్చినట్లు రేవంత్ బిల్డప్ ఇస్తున్నారన్నారు. ఒక ప్రాజెక్ట్ తయారు కావాలి అంటే డీపీఆర్ సిద్ధం కావాలి ...కానీ ప్రొసీజర్ లేకుండా పని ఎలా మొదలుపెడుతున్నారు అని ప్రశ్నించారు.

Here's Video: