Rain Alert to Telangana: తెలంగాణలోని 15 జిల్లాలకు వర్ష సూచన.. రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని యెల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Hyderabad, Nov 10: బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో (Telangana) మరో రెండ్రోజులపాటు వర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాల రాకతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు గురువారం తెలిపింది. ఈ మేరకు 15 జిల్లాలకు యెల్లో అలర్ట్ హెచ్చరికలు జారీచేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది.
యెల్లో అలర్ట్ హెచ్చరికలు ఈ జిల్లాలకే
హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Dhanteras 2023 : ధన త్రయోదశి ఎప్పుడు జరుపుకోవాలి...ఆ రోజు చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకుందాం..