Hyderabad, Nov 10: నేడే ధన త్రయోదశి (Dhanteras). దీనినే ధంతేరాస్ అని కూడా అంటారు. దీపావళి (Diwali) పండుగకి రెండు రోజుల ముందు నిర్వహించే ఈ ప్రత్యేక రోజుకు ఎంతో విశిష్టత ఉందని చెప్పవచ్చు. ఆశ్వీయుజ మాస కృష్ణ పక్షం త్రయోదశి తిథి రోజున ధన త్రయోదశి నిర్వహిస్తారు. ఆయుర్వేదాన్ని రచించిన ధన్వంతరిని (Dhanwantari) ఈ రోజున పూజిస్తారు. ఈ ధంతేరాస్ రోజున బంగారం, వెండి సహా వంట సామాగ్రి కొనుగోలు చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా ధన లాభం పొందుతారని ప్రజలు నమ్ముతారు. అంతే కాకుండా ‘అదృష్ట లక్ష్మి’ ఇండ్లకు వచ్చి అదృష్టవంతులవుతారని చాలా మంది భావిస్తారు. కుటుంబంలో ఆందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం. ఇలాంటి భోగభాగ్యాలు అందించే ఈ పండుగ శుభాకాంక్షలను లేటెస్ట్ లీ అందించే ఈ ప్రత్యేక ఫోటోలు, ఇమేజెస్ తో మీ బంధు, మిత్రులకు, ఆప్తులకు తెలియజేయండి.
Dhanteras 2023 : ధన త్రయోదశి ఎప్పుడు జరుపుకోవాలి...ఆ రోజు చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకుందాం..