దీపాల పండుగ ధన త్రయోదశితో ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి తిథి నాడు ధంతేరస్ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 29న ధంతేరస్ పండుగను జరుపుకోనున్నారు. ధంతేరస్ రోజున బంగారం, వెండి పాత్రలు, చీపుర్లు వంటి వాటిని కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ధంతేరస్ సందర్భంగా, ధన్వంతరి, యమరాజును పూజించే సంప్రదాయం ఉంది. ప్రతి సంవత్సరం ధంతేరస్ రోజున, మీరందరూ ఉత్సాహంగా షాపింగ్ చేస్తుంటారు. పురాణాల ప్రకారం ఆశ్వీయుజ  మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి తిథి నాడు సముద్ర మథనం సమయంలో ధన్వంతరి భగవంతుడు అమృత పాత్రతో దర్శనమిచ్చాడు. అందుకే ఈ తేదీని ధంతేరస్ లేదా ధనత్రయోదశి అని కూడా అంటారు. ధన్వంతరితో పాటు, లక్ష్మీ దేవి, సంపదకు ప్రభువైన కుబేరుడు, నరక లోక అధిపతి యమరాజ్‌లను కూడా ధన్‌తేరస్ రోజున పూజిస్తారు. దీపావళి పండుగ ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. ధన త్రయోదశి పర్వదినాన పసిడి కాంతులు మీ ఇంట విరాజిల్లాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలపాలని ఉందా..అయితే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి. 

లక్ష్మీదేవి కటాక్షంతో మీకు , మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం , ఐశ్వర్యం , ఆయుర్దాయం లభించాలని కాంక్షిస్తూ . హిందూ బంధువులందరికీ ధన త్రయోదశి శుభాకాంక్షలు .

సకల మానవాళికి ఆయురారోగ్యాలు , ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ , ప్రజలందరికీ ధన త్రయోదశి శుభాకాంక్షలు.

లక్ష్మీదేవి కటాక్షంతో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుర్దాయం లభించాలని కాంక్షిస్తూ బంధుమిత్రులందరికీ ధన త్రయోదశి శుభాకాంక్షలు

ధన త్రయోదశి పర్వదిన సందర్భంగా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ అందరికి పండుగ శుభాకాంక్షలు.

ఆ కుబేరుడు మిమ్మల్ని జీవితంలో ఐశ్వర్యం, విజయాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ మీకు ధన త్రయోదశి శుభాకాంక్షలు.