Weather Update: హైదరాబాద్ ను ముంచెత్తిన వాన.. తెలంగాణలో మరో 6 రోజులపాటు వర్షాలు.. నేడు, రేపు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటన

రానున్న మరో ఆరు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది.

Telangana heavy Rains, Car stuck at water, Rescued by locals

Hyderabad, Sep 1: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy Rains) తెలంగాణ తడిసి ముద్దవుతున్నది. రానున్న మరో ఆరు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది. ఇక భారీ వర్షాలతో హైదరాబాద్ (Hyderabad) అతలాకుతలం అవుతున్నది. నేడు కూడా నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు సెలవు...భారీ వర్షాలతో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ఈ ప్రాంతాల్లో ఇవాళ అతి తీవ్ర వర్షాలు..

నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కూరిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తీవ్ర వర్షాల నుంచి అతి తీవ్ర వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైద‌రాబాద్- విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై భారీ ట్రాఫిక్ జామ్, కోదాడ వ‌ద్ద వాహ‌నాల మ‌ళ్లింపు, నందిగామ వ‌ద్ద రోడ్డుపై ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న వాగు

రేపు వర్షాలు ఇలా..

సోమవారం రాష్ట్రంలోని అత్యధిక భాగంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, కొమరం భీమ్‌ లోని కొన్ని ప్రాంతాలతో పాటు, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.