Heavy Rains In HYD: భారీ వర్షంతో తడిసి ముద్దయిన హైదరాబాద్, జలమయమైన లోతట్టు ప్రాంతాలు, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
పలుచోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, కోఠి, అబిడ్స్, బేగంబజార్, సుల్తాన్ బజార్ నాంపల్లి, లక్డికాపూల్, మాసబ్‌ట్యాంక్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Hyderabad, october 20: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలోని జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, కోఠి, అబిడ్స్, బేగంబజార్, సుల్తాన్ బజార్ నాంపల్లి, లక్డికాపూల్, మాసబ్‌ట్యాంక్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. జనజీవనం అస్తవ్యస్థమైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీలన్నీ పొంగిపొర్లాయి. ప్రధాన కూడల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షంతో అటు జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమైయ్యారు. సహాయ చర్యలు ప్రారంభించారు.
వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నట్టుగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు, అక్కడక్కడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఏకంగా 19 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. నర్సంపేటలో 15 సెం.మీ. అతి భారీ వర్షం నమోదైంది. రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉందని వెల్లడించింది.