High Alert in Hyderabad: బెంగుళూరు బాంబు పేలుళ్లతో హైదరాబాద్‌లో హై అలర్ట్, కీలక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేసిన పోలీసులు

హైదరాబాద్‌లో పోలీసులు హైఅలెర్ట్‌ ప్రకటించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులను అప్రమత్తం చేశామని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు సీపీ వెల్లడించారు

Hyderabad CP Kothakota Srinivas Reddy (Photo-Video Grab)

Hyd, Mar 1: బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్‌లో పోలీసులు హైఅలెర్ట్‌ ప్రకటించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులను అప్రమత్తం చేశామని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు సీపీ వెల్లడించారు.బెంగుళూరు నగరంలో భారీ పేలుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కుండలహళ్లిలోని ఫేమస్‌ రామేశ్వరం కేఫ్‌ వద్ద టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్‌ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.

బెంగుళూరు రామేశ్వ‌రం కేఫ్ పేలుడు వీడియో ఇదిగో, ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలడంతో బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

అందరూ గ్యాస్ సిలిండర్ పేలిందని అనుకుంటున్న సమయంలో అది బాంబు పేలుళ్లే అని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఓ వ్య‌క్తి కేఫ్‌లో బ్యాగు పెట్టి వెళ్లిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయ‌ని తెలిపారు.ఆ బ్యాగులో ఉన్న ఐఈడీ కార‌ణంగానే పేలుళ్లు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు.ఈ పేలుడు ధాటికి 9 మందికి తీవ్ర గాయాల‌య్యాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.తాజాగా దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక్కసారిగా బాంబు పేలినట్లుగా కనిపిస్తోంది.