Telangana RTC Strike : ఆర్టీసీ కార్మికుల 'సకల జనుల సమరభేరి' సభకు హైకోర్ట్ అనుమతి, సమ్మెపై విచారణ మరోసారి వాయిదా, ప్రభుత్వం బోగస్ లెక్కలు సమర్పించిందని అశ్వత్థామ రెడ్డి ఆరోపణ

సరూర్ నగర్ గ్రౌండ్స్ లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సకల జనుల సమరభేరిని నిర్వహిస్తున్నామని తెలిపిన ఆర్టీసీ నేతలు, ఈ సభలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మరియు ప్రజలు...

High Court for the state of Telangana. | Photo- Wikimedia Commons.

Hyderabad, October 29: ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 30న సరూర్ నగర్ లో తలపెట్టిన 'సకల జనుల సమరభేరి' (Sakala Janula Samarabheri)కి హైకోర్ట్ అనుమతి మంజూరు చేసింది. ఈ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో కార్మిక సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి, ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చునని హైకోర్ట్ షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది.

అంతకుముందు ఆర్టీసీ సమ్మె (TSRTC Strike), బకాయిల చెల్లింపులపై హైకోర్టు (High Court of Telangana) లో వాడీవేడీ వాదనలు జరిగాయి. ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిన రూ. 4,253 కోట్లలో రీఎంబర్స్ మెంట్ బకాయిలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ రూ.335 కోట్లు చెల్లించిందా లేదా అనే విషయాన్ని తమకు వెల్లడించాలని ఆర్టీసీ ఎండీని కోర్ట్ ఆదేశించింది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సమర్పించిన నివేదిక అసమగ్రంగా, అస్పష్టంగా ఉందని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. బకాయిలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 31లోపు సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 1కి వాయిదా వేసిన హైకోర్ట్, ఆరోజున ఆర్టీసీ ఆర్థిక వ్యవహారాలు పరిశీలించే అధికారులు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశాల్లో పేర్కొంది.

కాగా, హైకోర్ట్ విచారణానంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) మీడియాతో మాట్లాడారు. విచారణలో భాగంగా ప్రభుత్వం అన్నీ బోగస్ లెక్కలు సమర్పించిందని ఆయన ఆరోపించారు. "2009 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ వాటా 42 శాతం రూ. 1099 కోట్లు బకాయిలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు బస్ పాస్ సబ్సిడీల కింద ఆర్టీసీకి బకాయి పడ్డ రూ. 1375 కోట్లు ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు. మున్సిపల్ చట్టం కింద మరో రూ. 1496 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి ఇవన్నీ తమ న్యాయవాది హైకోర్టులో ప్రస్తావించినపుడు, అంతకంటే ఎక్కువే ఇచ్చినట్లుగా ప్రభుత్వం చెప్పినపుడు, ప్రభుత్వానివన్నీ బోగస్ లెక్కలుగా హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది" అని అశ్వత్థామ రెడ్డి వివరించారు. ఆర్టీసీని ఎలా బతికిస్తారు అని ప్రభుత్వాన్ని హైకోర్ట్ నిలదీసినట్లుగా ఆయన తెలిపారు.

సరూర్ నగర్ గ్రౌండ్స్ లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సకల జనుల సమరభేరిని నిర్వహిస్తున్నామని తెలిపిన ఆర్టీసీ నేతలు, ఈ సభలో  ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ