Disproportionate Assets Case: ఆదాయానికి మించిన ఆస్తులు, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు 14 రోజుల రిమాండ్, చంచల్ గూడా జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు

కోర్టు ఆయనకు కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది

Former director of HMDA Shiva Balakrishna, arrested by ACB officials (photo-X/suryreddy)

Hyd, Jan 24: ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో (disproportionate assets case) అరెస్ట్ అయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను (HMDA former director Shiva Balakrishna) ఏసీబీ కోర్టులో అధికారులు హాజరు పర్చారు. కోర్టు ఆయనకు కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను చంచల్ గూడా జైలుకు తరలించారు. బాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రదేశాల్లో సోదాలు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడు బాలకృష్ణపై 13 (1) (b), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఏకంగా రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, వీడియోలు ఇవిగో..

బాలకృష్ణ ఇంటితో పాటు, బంధువులు, సహచురుల ఇళ్లల్లో సోదాలు చేశామన్నారు. బాలకృష్ణ ఇంట్లో రూ. 99.60 లక్షలు నగదు సీజ్ చేశామమని.. బంగారం 1988 గ్రాములు, సిల్వర్ 6 కేజీలు సీజ్ చేసినట్లు చెప్పారు. 8.26 కోట్లు రూపాయలు విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వ్యాల్యూలో ఇంకా ఎక్కువ ఉంటుందని తెలిపారు. మిగిలిన బీనామీలపై విచారణ చేయాల్సి ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.