Ganesh Immersion: 17న గణేశ్ నిమ‌జ్జ‌నం.. ఈ జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెల‌వు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అలా చూస్తే, మొత్తంగా నాలుగు రోజులు హాలీడే..

ఈ నెల 7వ తేదీన ప్రారంభ‌మైన వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు 17న నిమ‌జ్జ‌నం వేడుకలతో ముగియ‌నున్నాయి.

Ganesh Visarjan (photo/X/Hyd Police)

Hyderabad, Sep 14: తెలంగాణలో (Telangana) గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభ‌మైన వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు 17న నిమ‌జ్జ‌నం వేడుకలతో (Ganesh Immersion) ముగియ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా సెల‌వు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలంగాణా ప్ర‌భుత్వం తెలిపింది. విద్యార్థుల‌కు, ఉద్యోగుల‌కు ఇబ్బందులు క‌ల‌గొద్ద‌నే ఉద్దేశంతో ఈ సెల‌వు ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్ – మ‌ల్కాజ్‌గిరి జిల్లాల ప‌రిధిలోని విద్యాసంస్థ‌ల‌కు, ప‌లు ప్రభుత్వ కార్యాల‌యాల‌కు 17న సెల‌వు  ప్ర‌క‌టిస్తూ ప్ర‌భుత్వం శుక్ర‌వారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది.

దసరా కూడా రాకుండానే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్.. కేవలం ఐదు నిమిషాల్లోనే బెర్త్‌ లు ఫుల్

వరుసగా నాలుగు రోజులు హాలీడే

మంగళవారం గణేశ్ నిమ‌జ్జ‌నం సందర్భంగా ప్రకటించిన సెలవుతో కలిపి పైన పేర్కొన్న జిల్లాల్లోని వారికి మొత్తంగా నాలుగు రోజులు సెల‌వులు వ‌చ్చిన‌ట్లు అయింది. నేడు రెండో శ‌నివారం, రేపు ఆదివారం. ఇక సోమ‌వారం  మిలాద్ న‌బీ  కార‌ణంగా ప‌లు విద్యాసంస్థ‌ల‌కు, కార్యాల‌యాల‌కు ఇప్పటికే సెల‌వు ప్ర‌క‌టించారు. మంగ‌ళ‌వారం నిమ‌జ్జ‌నం సందర్భంగా ప్రభుత్వం తాజాగా సెలవును ప్రకటించింది. వెరసి ఇలా వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వులు రావ‌డంతో పైన పేర్కొన్న జిల్లాల విద్యార్థులు, ఉద్యోగులు లాంగ్ వీకెండ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

సైబ‌రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, సైబ‌ర్స్ ట‌వ‌ర్స్ నుంచి వెళ్లే వారికి ప్ర‌త్యామ్నాయ మార్గాలివే!