Ainavilli Temple (Credits: X)

Vijayawada, Feb 4: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) గణనాధుని ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి (Ainavilli Temple) ఆలయం. వాస్తవానికి కాణిపాకం కన్నా ముందే ఈ ఆలయం ఉందని విశ్వాసం. గణనాథుడు స్వయంభువుగా వెలసిన ఈ గణపతి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. వినాయక చవితి పర్వదినం, గణేశ నవరాత్రుల సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. సోమవారం వసంత పంచమి సందర్భంగా స్వామి వారి పాదాల దగ్గర లక్ష పెన్నులను కుప్పగా పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులుతీరారు.

నేడు రథ సప్తమి.. తిరుమల, అరసవల్లిలో సంబురాలు.. పోటెత్తిన భక్తులు (వీడియో)

స్వయంభువుగా వెలసిన వినాయకుడు

అయినవిల్లిలో స్వయంభువుగా వెలసిన వినాయకుని నారికేళ వినాయకుడు అని కూడా అంటారు. మనసులో కోరికను తలచుకొని భక్తితో ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు కోరిన కోర్కెలు తీర్చే నారికేళ గణనాథుడు భక్తులచే నిత్యం పూజలందుకుంటున్నాడు. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాల నడుమ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ దూరంలో, అమలాపురానికి 12 కి.మీ దూరంలో వెలసిన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఏకదంతుడు సిద్ధి వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నాడు.

ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన సోనూ సూద్, సీఎం చంద్రబాబుతో భేటీ