Shameerpet Road Accident: ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం, శామీర్‌పేట ఓఆర్‌ఆర్ దగ్గర విషాద ఘటన
హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై శామీర్‌పేట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Shameerpet Road Accident) ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
Hyderabad, Mar 15: తెలంగాణలో ఘోర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై శామీర్‌పేట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Shameerpet Road Accident) ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన కరుణాకర్‌రెడ్డి (46), భార్య సరళ (38), ఆమె చెల్లెలు సంధ్య(30)తో కలిసి కారులో గజ్వేల్‌లోని ఓ శుభకార్యానికి హాజరై తిరుగు పయనమయ్యారు.
ఈ క్రమంలో శామీర్‌పేట ఓఆర్‌ఆర్ గుండా ఉప్పల్‌కు వెళ్తుండగా లియోనియా సమీపంలో ముందుగా వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి ఢీ (Three killed after car rams container) కొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కరుణాకర్‌రెడ్డి, సరళ, సంధ్యలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మృతుల్లో స్థానిక టీఆర్‌ఎస్ నాయకుడు ఈరెల్లి రవీందర్‌రెడ్డి భార్య సంధ్య ఉన్నారు. ఆమె మృతిచెందిన వార్త తెలియడంతో చిలుకానగర్‌లో విషాదం నెలకొంది. కాగా ప్రమాదంలో మరణించిన కరుణాకర్‌రెడ్డి స్థానికంగా బియ్యం వ్యాపారం చేసుకుంటూ ఆదర్శ్‌నగర్ కాలనీ సాయిబాబా దేవాలయం కార్యదర్శిగా సేవలు అందిస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండే వీరు మృతిచెందడం కాలనీ వాసుల్ని కలచివేసింది.