Shyamala Goli: పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా గోలి శ్యామల రికార్డు, ప్రపంచంలోనే రెండో మహిళగా గుర్తింపు, 13 గంటల 43 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరిన శ్యామల, సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది వద్ద శిక్షణ
భారత్, శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని 30 కిలోమీటర్ల మేర ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళగా (Shyamala Goli) హైదరాబాద్‌కు చెందిన గోలి శ్యామల రికార్డులకెక్కారు. 13 గంటల 43 నిమిషాల్లోనే జలసంధిని ఈది ఔరా అనిపించారు. నిన్న ఉదయం 4.15 గంటలకు శ్రీలంక తీరంలో తన సాహసకృత్యాన్ని ప్రారంభించిన శ్యామల ఏకబిగిన 13.43 గంటల్లోనే ఈది రామేశ్వరంలోని ధనుష్కోడి చేరుకున్నారు.
Hyderabad, Mar 20: భారత్, శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని 30 కిలోమీటర్ల మేర ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళగా (Shyamala Goli) హైదరాబాద్‌కు చెందిన గోలి శ్యామల రికార్డులకెక్కారు. 13 గంటల 43 నిమిషాల్లోనే జలసంధిని ఈది ఔరా అనిపించారు. నిన్న ఉదయం 4.15 గంటలకు శ్రీలంక తీరంలో తన సాహసకృత్యాన్ని ప్రారంభించిన శ్యామల ఏకబిగిన 13.43 గంటల్లోనే ఈది రామేశ్వరంలోని ధనుష్కోడి చేరుకున్నారు.
కాగా 2012లో సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది పాక్ జలసంధిని 12 గంటల 30 నిమిషాల్లో ఈదిన సంగతి తెలిసిందే. ఆయనే శ్యామలకు ఈతలో మెళకువలు నేర్పి, మెరుగైన శిక్షణ ఇప్పించారు. కాగా, పాక్ జలసంధిని ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళ శ్యామల (Hyderabad-based entrepreneur Syamala Goli ) కావడం విశేషం. నాలుగేళ్ల క్రితం ఈతలో శిక్షణ ప్రారంభించారు.
గతేడాది నవంబరులో గంగానదిలో 30 కిలోమీటర్ల దూరాన్ని 110 నిమిషాల్లోనే ఈది ఆరో స్థానంలో నిలిచారు. అలాగే, గతేడాది దక్షిణ కొరియాలోని గ్వాన్‌జులో జరిగిన ఫినా వరల్డ్ మాస్టర్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2012లో పాక్ జలసంధిని 12.30 గంటల్లోనే ఈదిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది వద్ద శ్యామల (second woman ever to swim across Palk Strait) శిక్షణ పొందుతున్నారు. శ్యామల తన విజయాన్ని మహిళల విజయంగా అభివర్ణించారు.
శ్యామల హైదరాబాద్ నగరంలో యానిమేషన్ చిత్రాల నిర్మాతగా, డైరెక్టర్‌గా, రచయితగా పలు పాత్రలు పోషిస్తున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన శ్యామలది మధ్యతరగతి రైతుకుటుంబంలో జన్మించారు. తండ్రి కంటె వెంకటరాజు ఒకప్పుడు వెయిట్ లిఫ్టర్ గా ఖ్యాతికెక్కారు. తాను క్రీడారంగంలో ఉన్నప్పటికీ పిల్లలను మాత్రం వాటికి దూరంగా ఉంచాలని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో శ్యామలను ఐఏఎస్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ చదువుపై అంతగా ఆసక్తిలేని శ్యామల.. చిత్రకళపై దృష్టిసారించి యానిమేటర్ అయ్యారు.
మా జూనియర్స్ చానల్‌లో యానిమేషన్ సిరీస్ చేశారు. లిటిల్ డ్రాగన్ అనే యానిమేషన్ సినిమా కూడా తీశారు. అయితే, ఆ సినిమాతో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో యానిమేషన్‌కు విరామిచ్చారు. అనంతరం 44 ఏళ్ల వయసులో స్విమ్మింగ్ నేర్చుకుని మరో కెరీర్‌కు శ్రీకారం చుట్టారు. పలు ఈవెంట్లలో పాల్గొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించారు. గతంలో హుగ్లీలో 14 కిలోమీటర్లు ఈది విజేతగా నిలిచారు. ఈ క్రమంలోనే తాజాగా పాక్ జలసంధిని విజయవంతంగా అధిగమించి కొత్త రికార్డు సృష్టించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)