Modi in Hyderabad: నేడే బీజేపీ భారీ బహిరంగ సభ, 10లక్షల మంది వస్తారని కాషాయవర్గాల అంచనా, హైదరబాద్‌లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, యథావిధిగా మెట్రో ట్రైన్లు, పరేడ్ గ్రౌండ్స్‌ లో సర్వం సిద్ధం చేసిన బీజేపీ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల(BJP national executive meeting) తర్వాత భారీ బహిరంగ(Rally) నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో (parade Grounds)విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభలో మోదీ(Modi) ప్రసంగిస్తారు. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయనున్నారు. తెలంగాణలో పాగా వేయడానికి రోడ్‌మ్యాప్‌(road map) ఇవ్వనున్నారు

Hyderabad, July 03: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల(BJP national executive meeting) తర్వాత భారీ బహిరంగ(Rally) నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో (parade Grounds)విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభలో మోదీ(Modi) ప్రసంగిస్తారు. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయనున్నారు. తెలంగాణలో పాగా వేయడానికి రోడ్‌మ్యాప్‌(road map) ఇవ్వనున్నారు. ఇవాళ్టి సభతో కార్యకవర్గ సమావేశాలు (BJP national executive meeting) ముగియనున్నాయి. సభ కోసం.. 3 వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై.. ప్రధాని మోదీ(PM Modi), జేపీ నడ్డాతో పాటు మరో ఇద్దరు కీలక నేతలు మాత్రమే ఉంటారు. జాతీయ కార్యవర్గ సభ్యులకు, రాష్ట్ర బీజేపీ నేతలకు.. వేర్వేరుగా వేదికలు ఉన్నాయి. దాదాపు.. 10 లక్షల మంది బీజేపీ శ్రేణులు, ప్రజలు తరలివస్తారని.. కాషాయ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.

వర్షం పడినా.. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు, శక్తి కేంద్రాల స్థాయిలో సన్నాహక సమావేశాలను నిర్వహించారు. కార్యకర్త స్థాయి నుంచి కింది స్థాయి నాయకుల వరకు అంతా.. పరేడ్ గ్రౌండ్‌కు తరలివచ్చేలా ప్లాన్ చేశారు.

PM Modi In Hyderabad: హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం, ప్రధాని మోదీ హాజరు, కీలక అంశాలపై చర్చించే అవకాశం... 

ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు పాల్గొంటున్న ఈ సభకు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో 3వేల మందితో పోలీసులు భద్రత కల్పించారు. సభ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

UP CM Yogi Visit Bhagyalakshmi Temple: చార్మినార్ భాగ్యలక్ష్మీ గుడిని సందర్శించనున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు.. 

హైదరాబాద్ లో నేడు మెట్రో రైళ్లు(Metro trains) సాధారణంగానే నడవనున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ సభ కారణంగా నేడు మెట్రో రైళ్లు నిలిపివేస్తారన్న ప్రచారంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆదివారం మెట్రో రైళ్ల రాకపోకలపై వస్తున్న ఊహాగానాలకు హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి (NVS Reddy) తెరదించారు. మెట్రో రైళ్లను నిలిపివేయబోమని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. మూడు కారిడార్ల పరిధిలో రైళ్లు యథావిధిగా నడుస్తాయని, రోజూ మాదిరిగానే అన్ని స్టేషన్లలో రైళ్లు ఆగుతాయని పేర్కొన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now