Gas Cylinder Blast In Hyd: సికింద్రాబాద్‌లో పెద్ద శబ్దంతో పేలిన గ్యాస్ సిలిండర్, ఒకరు మృతి, తొమ్మిది మందికి గాయాలు, పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం
ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.
Hyd, Oct 26: సికింద్రాబాద్ లోని చిలకలగూడ పరిధిలోని దూద్ బావి బస్తీలో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
స్కూల్లో గుండెపోటుతో కుప్పకూలిన మూడో తరగతి విద్యార్థి, రాజన్న సిరిసిల్లాలో విషాదకర ఘటన
ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని ఇంటి యజమాని నారాయణరావుగా గుర్తించారు. ఆయన భార్య, పిల్లలు సైతం గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ప్రభావానికి స్థానికంగా ఎనిమిది ఇళ్ల వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సంఘటన స్థలంలో క్లూస్ టీం, బాంబ్ స్కాడ్ తనిఖీలు చేపట్టింది. గ్యాస్ లీక్ కారణంగానే సిలిండర్ పేలినట్టుగా అనుమానిస్తున్నారు.