Cyber Nude Call: ఇంజినీరింగ్ విద్యార్థికి యువతి నగ్న వీడియో కాల్.. ఘట్‌ కేసర్‌ లో మరో స్కాం.. ఏంటది??

హైదరాబాద్ లోని ఘట్‌ కేసర్‌ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి ఓ అనామక యువతి నగ్న వీడియో కాల్ చేసి.. డబ్బులు వసూలు చేసింది.

Nude Video Call (Credits: X)

Hyderabad, Nov 23: హైదరాబాద్ (Hyderabad) లోని ఘట్‌ కేసర్‌ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి ఓ అనామక యువతి నగ్న వీడియో కాల్ (Nude Video Call) చేసి.. డబ్బులు వసూలు చేసింది. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ కు చెందిన ఓ విద్యార్థి (22) ఘట్‌ కేసర్‌ లోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజ్ లో బీటెక్ చేస్తున్నాడు. కాలేజీ సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి తన వాట్సాప్‌ కు దీక్షికా అగర్వాల్‌ పేరిట వీడియో కాల్‌ వచ్చింది. ‘ఎలా ఉన్నావ్.. బాగున్నావా.. ఎలా చదువుతున్నావు.. పరీక్షలు ఎప్పుడు..’ అంటూ ఆ యువతి మాట్లాడటం మొదలు పెట్టింది. ఈ తరుణంలోనే… యువతి అడిగిన ప్రశ్నలకు సదరు విద్యార్థి సమాధానం చెప్తుండగా హఠాత్తుగా ఆ యువతి నగ్నంగా మారిందని బాధితుడు చెప్పాడు.

కంటిలో నలక పడిందని వస్తే, సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.. హైదరాబాద్ లో ప్రైవేటు కంటి దవాఖాన ముందు బంధువుల ఆందోళన (వీడియో)

మూడు విడతలుగా రూ. 20 వేలు

ఆ వెంటనే ఆ దృశ్యాలను రికార్డు చేసిన సదరు యువతి ఆ నగ్న వీడియోను సదరు విద్యార్థికి పంపింది. తనకు డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియో పంపిస్తానని బెదిరింపులకు పాల్పడిందని బాధితుడు వాపోయాడు. మూడు విడతలుగా రూ. 20 వేల మేర ఆన్‌ లైన్‌ లో డబ్బులు పంపినా కూడా మరోసారి బెదిరింపులు రావడంతో భయపడి పోయి పోలీసులను ఆ విద్యార్ధి ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.

మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ షురూ.. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే హవా.. కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే (లైవ్)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో, ఫోటోలు

Cyber Fraud in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం

Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు

Advertisement
Share Now
Advertisement